schedule Tuesday, August 25, 2026

పలు కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

calendar_today December 31, 2024
person meenewstelugu
పలు కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

పలు కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

 మాజీ ఎంపీటీసీ పగడాల విద్యావతి వెంకట్ రెడ్డి

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 30 :: మోతె మండల కేంద్రంలోని అనారోగ్యంతో మరణించిన దోసపాటి లచ్చమ్మ, మరియు దోసపాటి లింగయ్య ల కుటుంబాలను పరామర్శించిన మోతె బిఆర్ఎస్ పార్టీ నాయకులు.మోతె గ్రామ మాజీ ఎంపీటీసీ పగడాల విద్యావతి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కుటుంబాలకు ఆర్థిక సహాయంగా బియ్యం వంట సమగ్రి అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జిల్లపల్లి ముత్తయ్య, ఇండ్ల వెంకటేశం, పెరమళ్ళ వెంకన్న,అండెం నారాయణ, నకరికంటి మల్లయ్య, అయితబోయిన జగ్గయ్య, దోసపాటి రంగయ్య, దోసపాటి ఏసు, వీరబోయిన రామ్ మల్లు, దోసపాటి రాము, శ్రీను రెడ్డి, జిల్లపల్లి సుందర్, అయితబోయిన నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.