schedule Monday, August 24, 2026

సమస్యలతో వచ్చే ప్రజలను ఆదుకోవాలి కలెక్టర్ 

calendar_today January 4, 2025
person meenewstelugu
సమస్యలతో వచ్చే ప్రజలను ఆదుకోవాలి కలెక్టర్ 

సమస్యలతో వచ్చే ప్రజలను ఆదుకోవాలి కలెక్టర్ 

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

గ్రూప్ ఫోర్ ద్వారా రెవెన్యూ శాఖలో 47 మందికి ఉద్యోగాలు జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ 

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా 

సమస్యలతో వచ్చే ప్రజలను సాయం చేస్తూ వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ అన్నారు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ఇటీవల టి జి పి ఎస్ సి ద్వారా ఉద్యోగం పొందిన 47 మందికి కౌన్సిలింగ్ నిర్వహించి రెవెన్యూ శాఖలో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించినందుకు అభినందనలు తెలిపారు, రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రజలతో మంచిగా ప్రవర్తించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చివరి వ్యక్తికి చేరే విధంగా కృషి చేయాలని కార్యాలయానికి సమయపాలన పాటించాలని ఎలాంటి అత్యాశకి పోకుండా విధులు నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి సూపర్డెంట్ పద్మారావు సిబ్బంది అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు