schedule Monday, August 24, 2026

ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ   అనుమతులు వెంటనే రద్దు చేయాలి రైతుల డిమాండ్

calendar_today January 5, 2025
person meenewstelugu
ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ   అనుమతులు వెంటనే రద్దు చేయాలి రైతుల డిమాండ్
 

ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ   అనుమతులు వెంటనే రద్దు చేయాలి రైతుల డిమాండ్

 ఉమ్మడి నల్లగొండ జిల్లా మానవ హక్కుల వేదిక కమిటీ గ్రామ రైతులతో చర్చ

 

 మీ న్యూస్ ప్రతినిధి జనవరి 05::: సూర్యాపేట జిల్లా మోతే మండలం రావి పహాడ్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీని నిజ నిర్ధారణ సందర్శించి సమీప గ్రామ ప్రజల ను, రైతులను కలవడం జరిగింది. ఇక్కడ రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు వలన కాలుష్యం ఏర్పడి మా పంటలకు నష్టం కలుగుతుందని రావి పహాడ్ ఇథనాల్ ఫ్యాక్టరీలో రోజుకు ఒక లక్ష 50 వేల లీటర్ల ఇథనాల్ తయారు చేస్తారని దానికి 10 లక్షల లీటర్ల నీరు అవసరం అవుతున్నదని, దీనివల్ల మాకు నీటి సమస్య ఏర్పడుతుందని చుట్టుపక్కల గ్రామాలు కాలుష్య బారినపడి దీర్ఘకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అందువల్ల ఇథనాల్ ఫ్యాక్టరీ పర్మిషన్లు రద్దుచేసి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని మానవ హక్కుల వేదిక దృష్టికి తీసుకువచ్చారు. కంపెనీ అధికారులను కలవడానికి ప్రయత్నం చేయగా వారు అందుబాటులో లేరు. అందుబాటులో ఉన్న ఫ్యాక్టరీ ఇంజనీర్ మరియు పాయింట్ ఇంచార్జ్ లు ఫ్యాక్టరీ నిర్మాణ క్రమాన్ని మాత్రమే వివరిస్తున్నారు కానీ అసలు విషయాలను దాటవేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకోవచ్చామని అన్నారు. కానీ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేయకూడదని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మా దృష్టికి తీసుకువచ్చారు. కావున జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై స్పందించి ఇప్పటికైనా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి జిల్లా యంత్రాంగం ప్రజలతో చర్చించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా మానవ హక్కుల వేదిక అభిప్రాయం వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు అక్కినపల్లి వీరస్వామి, జిల్లా సహాయ కార్యదర్శులు గడ్డం వెంకటరమణ, చెట్టుపల్లి కాశీరాం, ప్రతాప్ వీరితోపాటు ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట నాయకులు ఎం డేవిడ్ కుమార్ మట్టిపల్లి సైదులు మాధవరెడ్డి పేర్ల నాగయ్య,గంట నాగయ్య , కునుకుంట్ల సైదులు,పుల్లారావు, నూకల ఉపేందర్ రెడ్డి, కాకి పాపిరెడ్డి, పానుగంటి మల్లారెడ్డి, నారాయణరెడ్డి, రావి పహాడ్ మాజీ ఎంపిటిసి పోడపంగి ముత్తయ్య, ఎర్ర అఖిల్, అలుగుబెల్లి వెంకటరెడ్డి, వీరాచారి తదితరులు పాల్గొన్నారు  .