schedule Monday, August 24, 2026

జిల్లాలో చైనా మాంజా వాడకం నిషేదం

calendar_today January 8, 2025
person meenewstelugu
జిల్లాలో చైనా మాంజా వాడకం నిషేదం

జిల్లాలో చైనా మాంజా వాడకం నిషేదం

భానుపురి /సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయం

 

మీ న్యూస్ ప్రతినిధి ::: పతంగులు ఎగరవేయడానికి వాడే చైనా మాంజా వలన ప్రజలకు, జంతువులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.సంక్రాంతి సందర్భంగా జిల్లాలో చిన్నపిల్లలు, పెద్దలు సరదా కొరకు ఎగరవేసే పతంగులకు నైలాన్, సింథటిక్ తో తయారు చేసినా చైనా మంజా వాడడం, వాడి పడేయడం వలన ప్రజలకు, పక్షులకు ప్రమాదాల వాటిల్లే అవకాశాలు ఉన్నాయని ఎస్పి తెలిపారు. కావున జిల్లాలో చైనా మాంజా విక్రయాలు, వినియోగాల పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందనీ, ఎవ్వరయినా నిలువ ఉంచిన, తయారుచేసినా, అమ్మినా, అమ్మడానికి ఎవ్వరయినా ప్రోత్సహించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. చైనా మంజా చెట్లకు, ఎలక్రిక్ తీగలకు తగిలి వేలాడి ప్రజలకు, జంతువులకు చుట్టుకుని ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, ఈ మాంజా తగిలి కొన్ని ప్రాంతాలలో ప్రమాద సంఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. కావున విక్రయదారులు ఎవ్వరయినా చైనా మంజా నిలువచేసిన, అమ్మిన, వాడినా డయల్ 100 కి గాని, సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించగలరని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.