schedule Saturday, June 13, 2026

అంతరం గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు ఆకస్మితంగా తనిఖీ

calendar_today August 21, 2024
person meenewstelugu

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు ఆకస్మికంగా తనిఖీ

 అంతర గ్రామం ఆదర్శ పాఠశాల కింద మంజూరైన పనులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్


అనంతరం        తాండూర్, ఆగస్టు 21: మీ న్యూస్ ప్రతినిధి అమ్మ ఆదర్శ పాఠశాలల్లో భాగంగా చేపడుతున్న పనులు నాణ్యతయుతంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. బుధవారం తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, ఆంతారం గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద జరుగుతున్న వివిధ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో ఒకే మరుగుదొడ్డి ఉండడం వల్ల విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుందని, అదనంగా మరుగుదొడ్డి నిర్మాణలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కు సూచించారు. మరుగుదొడ్లకు బిగించిన ప్లైవుడ్ డోర్లను తొలగించి వాటి స్థానంలో వేరే వాటీని బిగించాలని ఆయన తెలిపారు. మరుగుదొడ్లకు నీటి సరఫరా తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అంగన్వాడీలలో చేపడుతున్న పనుల్లో భాగంగా పెయింటింగు, లైట్లు, ఫ్యానులు, బోర్డు సౌకర్యాలను కచ్చితంగా కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. డి ఎం ఎఫ్ టి నిధులతో వేసిన బోర్ వెల్, సీసీ రోడ్లను ఆయన పరిశీలించారు. Antharam