schedule Saturday, June 13, 2026

వివేకానంద జీవితం యువతకు ఆదర్శం

calendar_today January 13, 2025
person meenewstelugu

వివేకానంద జీవితం యువతకు ఆదర్శం

   

మీ న్యూస్ ప్రతినిధి సూర్యాపేట జిల్లా జనవరి 12::: వివేకానంద జీవితము యువత కు ఆదర్శమని జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్వి హాస్పిటల్ లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడుతూ వివేకానందుని ఉపన్యాసాలు ప్రపంచ ప్రజలకు దేశ ఔన్నత్యాన్ని తెలియజేశాయి అని అన్నారు యువకులు ఆయన స్ఫూర్తితో తమ జీవితాన్ని ముందుకు సాగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ ఉద్యోగుల యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తలూరు యాదగిరి గౌడ్ మునగంటి వెంకటేశ్వర్లు గౌడ్ఎలుగూరి కిరణ్ గౌడ్ కార్యదర్శులు అబ్బగోని వెంకటయ్య గౌడ్ చీకూరి అనిల్ గౌడ్ మండవ నరేష్ గౌడ్ రాచకొండ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.