మండల పరిధిలోని చంద్రవంచ గ్రామ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ యువజన సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కమిటి సభ్యులు ప్రకటించిన్నారు
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ అధ్యక్షులు ఎస్ మోహన్
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బొడ్డు విజయ్ కుమార్
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ కోశాధికారి సర్వని ఎల్లప్ప
తాండూర్ రూరల్ మీ న్యూస్ ప్రతినిధి :: తాండూరు మండలం చంద్రవంచ గ్రామంలో బోనమ్మ ఆలయం దగ్గర డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ యువజన సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కమిటి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎస్ మోహన్ మాట్లాడుతూ చంద్రవంచ గ్రామ అభివృద్ధిలో అంబేద్కర్ యువజన సంఘం కృషి ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం అభివృద్ధికి, అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని, అందుకు గ్రామ ప్రజల, సంఘం సభ్యుల సహకారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొడ్డు వెంకటప్ప. సర్వని నర్సిములు. సుందరప్ప. గంగారాం బలప్ప, ప్రవీణ్. శివకుమార్. వెంకటప్ప. లక్ష్మప్ప. జర్నప్ప. వెంకటేష్. శ్రీనివాస్. నరేష్. రాజేష్. అశోక్. జగదీష్ గ్రామ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.