76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి....
calendar_today
January 19, 2025
person
meenewstelugu
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి....
శఖటాలు,స్టాల్స్ ఏర్పాటు
ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జనవరి 18::76వ గణతంత్ర వేడుకలను ఘనంగా. నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం ఐడిఓసి ప్రదాన సమావేశ మందిరం నందు జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 76వ గణతంత్ర వేడుకలను స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించుటకు అధికారులు ముందు ప్రణాళికలు రూపొందించుకొని సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల పై స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులతో సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, అధికారులకు, సిబ్బందికి ఉత్తమ ప్రశంసా పత్రాలు ఇచ్చుటకు గాను సంబంధిత శాఖాధిపతులు తమ సిబ్బంది పేర్లను 21తేది కల్లా పంపించాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయుచున్న 6 గ్యారంటీ పథకాల ప్రచారంపై శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని,సంసృతికకార్యక్రమాలు నిర్వహించాలని, మున్సిపల్ శాఖ త్రాగునీరు, శానిటేషన్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జనార్దన్ రెడ్డి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.