సూర్యాపేట జిల్లా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ ఎన్నిక
calendar_today
January 21, 2025
person
meenewstelugu
సూర్యాపేట జిల్లా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ ఎన్నిక
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 20:::డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీని సిటీ టాలెంట్ స్కూల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా పబ్బతి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా కొచ్చర్ల వేణు ఉపాధ్యక్షులుగా జి వెంకటేశ్వర్లు, జే రమణ జి ఆనంద్ భాస్కర్ తో పాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య వ్యవహరించగా ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి ఎస్ భాస్కర్ ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఎన్నికకు సహకరించిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ సంఘ బలోపేతానికి మా వంతుగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు.