పెద్దగట్టు జాతరను రాష్ట్ర పండుగ గా గుర్తించాలి :డాక్టర్ రామ్మూర్తి యాదవ్
calendar_today
January 26, 2025
person
meenewstelugu
పెద్దగట్టు జాతరను రాష్ట్ర పండుగ గా గుర్తించాలి :డాక్టర్ రామ్మూర్తి యాదవ్
మీ న్యూస్ ప్రతినిధి:::సూర్యాపేట : దురాజపల్లి పెద్దగట్టు లింగామంతుల జాతరను రాష్ట్ర పండుగ గా గుర్తించాలని శ్రీ కృష్ణ ట్రస్ట్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 20 కోట్లు కేటాయించాలని కోరారు. లక్షల మంది భక్తులు వచ్చే జాతరను విస్మరించవద్దన్ని పేర్కొన్నారు. కులాల మతాలకు అతీతంగా భక్తులు వచ్చే విషయాన్నీ ప్రభుత్వం గుర్తించి నిదులు కేటాయించాలా తెలిపారు. జాతర కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలని కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమం లో గొడ్డెటి సైదులు యాదవ్,సుంకర బోయిన శ్రీనివాస్ యాదవ్, మర్యాద సైదులు యాదవ్, వజ్జా వీరయ్య యాదవ్, వీరబోయిన లింగయ్య యాదవ్, సుంకర బోయిన వెంకన్న యాదవ్,కంచుగట్ల శ్రీనివాస్ యాదవ్, బడుగుల సైదులు యాదవ్, బోయిని సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.