schedule Tuesday, August 25, 2026

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దిగ్భ్రాంతి

calendar_today January 27, 2025
person meenewstelugu
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దిగ్భ్రాంతి

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దిగ్భ్రాంతి

కండక్టర్ వెంకన్న దంపతులకు పరామర్శ

మృతుడు దారమల్ల మధుబాబు తండ్రి ఎంకన్నను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

   

మీ న్యూస్ మోతే ప్రతినిధి జనవరి 27:::సీనియర్ బి ఆర్ యస్ నేత కండక్టర్ వెంకన్న తనయుడు మధుబాబు హార్ట్ ఎటాక్ తో మరణించారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.మృతుడి తండ్రి కండక్టర్ వెంకన్న దంపతులను ఓదార్చారు.మృతుడు మధుబాబు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వెంకన్న దంపతులను మల్లయ్య యాదవ్ ఓదార్చారు. మధుబాబు హార్ట్ ఎటాక్ తో మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వరరావు , శ్రీధర్ రెడ్డి, హనుమాన్ చారి, కుక్క బిక్షం, సతీష్, బొజ్జ నాయక్, సర్వనాయక్, ఎల్ శ్రీను, గోవర్ధన్, నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.