schedule Saturday, August 22, 2026

ఫుడ్ పాయిజన్ గట్టన పై సమగ్ర విచారణ జరిపించాలి

calendar_today January 30, 2025
person meenewstelugu
ఫుడ్ పాయిజన్ గట్టన పై సమగ్ర విచారణ జరిపించాలి

ఫుడ్ పాయిజన్ గట్టన పై సమగ్ర విచారణ జరిపించాలి

 పుల్లూరి సింహాద్రి PDSU జిల్లా అధ్యక్షుడు

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 29:::సూర్యాపేట జిల్లా కేంద్రంలోని (S.T) బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని PDSU జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరి నగర్ ప్రభుత్వ గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహ విద్యార్థినీ మధ్యాహ్నం నాణ్యత లేని కలుషితమైన భోజనం తిని అనంతరం పాఠశాలకు వెళ్లిన 12 మంది విద్యార్థినిలకు వాంతులు అవడంతో పాటు అనారోగ్యానికి గురి కావడం జరిగింది.వారు తిరిగి కోలుకోవడాని మెరుగైన చికిత్సను అందిచాలని డిమాండ్ చేశారు.ఆ విద్యార్థులు హాస్టల్ లో కలుషితం అయిన ఆహారం తినే అశ్వాస్తకి గురైతే వాళ్ళు బయట ఆహారం తినడం వల్ల జరిగిందని అనడం అంటే విద్యార్థుల అన్యాయం చేయడమే.తక్షణమే హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలి.గత కొద్ది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అశ్వస్థకి గురై పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరేతినట్టు విజయోత్సవాలు జరుపుతున్నాయని విమర్శించారు.తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫుడ్ పోయిజన్ ఘటనలపై కమిటీ వేసి విచారణ జరిపి దోషలను కఠినంగా శిక్షించాలని అన్నారు .అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన మెస్ బిల్ లను అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో PDSU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో PDSU డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, మందడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.