schedule Monday, August 24, 2026

బీసీ మహిళా బషీరాబాద్ మండల అధ్యక్షురాలుగా కొత్తూరు విరమణి

calendar_today January 31, 2025
person meenewstelugu
బీసీ మహిళా బషీరాబాద్ మండల అధ్యక్షురాలుగా కొత్తూరు విరమణి

బీసీ మహిళా బషీరాబాద్ మండల అధ్యక్షురాలుగా కొత్తూరు విరమణి

నియామక పత్రం అందజేసిన జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్

 విరమణికి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి, సయ్యద్ సుకుర్

   మీ న్యూస్ ప్రతినిధి :::తాండూర్ నియోజవర్గం బషీరాబాద్ మండల బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలుగా గొట్టిగ కలాన్ గ్రామానికి చెందిన కొత్తూరు విరమణి ఎన్నికయ్యారు జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ విరమణికి నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ విరమణి గత కొన్ని సంవత్సరాలుగా మహిళల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారని విరమణి లాంటి మహిళను బషీరాబాద్ మండల అధ్యక్షురాలుగా నియమించడం బీసీ సంఘంకు అదనంగా బలాన్ని చేకూరుస్తుందని ప్రతి గ్రామంలో బీసీ సంఘం కమిటీలను నియమించే సత్తా విరమణికి ఉందని జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సూచన మేరకు విరమణికి నియామక పత్రం అందజేశామని రాజ్ కుమార్ అన్నారు అదేవిధంగా విరమణి మాట్లాడుతూ నాపై నమ్మకముతో బషీరాబాద్ మండల అధ్యక్షురాలుగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కు రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు ఈ సందర్భంగా మహిళ అధ్యక్షురాలుగా నియమితులైన విరమణికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి అనిత నరసమ్మ మంజుల రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్ జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేష్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజ్ యువ నాయకులు జుంటుపల్లి వెంకట్ సయ్యద్ లాల్ తదితరులు పాల్గొన్నారు