schedule Monday, August 24, 2026

గిరిజన హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

calendar_today February 1, 2025
person meenewstelugu
గిరిజన హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

 గిరిజన హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

 పుల్లూరి సింహాద్రి PDSU జిల్లా అధ్యక్షులు

 

మీ న్యూస్ జిల్లా ప్రతినిధి::ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని బాలికల గిరిజన హాస్టల్ లో జరిగిన ఫుడ్ పాయిజన్ పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని అదనపు కలెక్టర్ రాంబాబుకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ, సూర్యాపేట పట్టణంలోని బాలిక గిరిజన హాస్టల్ లో నాణ్యమైన భోజనం అందజేయకపోవడంతో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ తో దశలవారీగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. దీనిపైన సమగ్రంగా విచారణ జరపాలి. ఈ విధంగా హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలపాలి. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించకపోవడంతో నాన అవస్థలు పడుతున్నారు. తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం , మోషన్స్, వాంతింగ్స్ తో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల సంక్షేమ హాస్టల్స్ లో వైద్యాధికారులు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని, హెల్త్ క్యాంపులు నిర్వహించాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన మెస్ బిల్లులను అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు ప్రవీణ్,మందడి శ్రీధర్, మహేష్ నవీన్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.