schedule Tuesday, November 03, 2026

అరుణోదయ  సాంస్కృతిక సమైక్య సంఘాల విలీన సభ

calendar_today February 3, 2025
person meenewstelugu
అరుణోదయ  సాంస్కృతిక సమైక్య సంఘాల విలీన సభ

 అరుణోదయ  సాంస్కృతిక సమైక్య సంఘాల విలీన సభ

ఫిబ్రవరి 5వ తారీఖున సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే రెండు అరుణోదయ  సాంస్కృతిక సమైక్య సంఘాల విలీన సభను జయప్రదం చేయండి

  రావిపాడు గ్రామంలో అరుణోదయ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది

 

మోతే మీ న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 03:: ఈ సందర్భంగా AIKMS నాయకులు పొడపంగి ముత్తయ్య మాట్లాడుతూ నక్సల్ బరి శ్రీకాకుళం గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాల వెలువలో ఉస్మానియా కేంద్రంగా అరుణోదయ ఆవిర్భవించి రెండు తెలుగు రాష్ట్రాలలో భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కై సాగిన ప్రతి పోరాటంలో సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శిస్తూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మలిదశ తెలంగాణ పోరాటంలో అగ్ర భాగాన నిలిచి సకల జనుల సమ్మెకు పూర్తి మద్దతునిస్తూ అనేక తెలంగాణ పోరాట పాటలను ఆలపిస్తూ స్వరాష్ట్రం సాధించేంతవరకు కాలుకు గజ్జ కట్టి.డప్పు సంకనేసీ భుజాన గొంగడి తో తెలంగాణ ఉమ్మడి పది జిల్లాలు తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఈ క్రమంలోనే పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని నిలబడి కలబడి రాష్ట్రం వచ్చేంతవరకు తెలంగాణ పోరాటంలో అగ్ర భాగాన నిలిచిందని, అరుణోదయ ఉస్మానియా క్యాంపస్ లో ఆవిర్భవించినప్పటి నుండి విప్లవోద్యమంలో ఒరిగిన అమరవీరులను స్మరిస్తూ అనేక పాటలను పాడుతూ ప్రజల అదరాభిమానాలు చొరగొని శ్రమజీవుల పక్షాన నిలిచిందన్నారు 2013 నుండి విడివిడి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈనెల 5వ తారీఖు సూర్యాపేటలో విలీనం కాబోతున్న రెండు అరుణోదయ సంస్థల విలీన సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో, సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ గ్రామ కార్యదర్శి మోతుకూరి వీరాచారి ,ఎర్రబోయిన వెంకన్న, కొత్తపల్లి ఉప్పలయ్య ,కొంచెం వెంకన్న, కొడిదల ఎల్లయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు