ఆర్య వైశ్య సంఘం పొలిటికల్ కమిటీ ఛైర్మెన్ గా కక్కిరేణి శ్రీనివాస్ నియామకం
calendar_today
February 6, 2025
person
meenewstelugu
ఆర్య వైశ్య సంఘం పొలిటికల్ కమిటీ ఛైర్మెన్ గా కక్కిరేణి శ్రీనివాస్ నియామకం
మీ 31 న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 06::సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్ గా సూర్యాపేటకు చెందిన జిల్లా ఆర్య వైశ్య సంఘం ఉపాధ్యక్షులు కక్కిరేణి శ్రీనివాస్ నియామకమయ్యారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు గురువారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కక్కిరేణి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభ్యున్నతి కొరకు కృషి చేస్తానని తెలిపారు.