schedule Monday, August 24, 2026

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కుల దురంహాంకార హంతకులను కఠినంగా శిక్షించాలి

calendar_today February 6, 2025
person meenewstelugu
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కుల దురంహాంకార హంతకులను కఠినంగా శిక్షించాలి

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కుల దురంహాంకార హంతకులను కఠినంగా శిక్షించాలి

బంటి కుటుంబానికి రక్షణ కల్పించాలి

 

ప్రభుత్వం బంటి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి

 మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధిఫిబ్రవరి 6:సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన దళిత యువకుడు వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటిని కుల దురంహకార హత్య చెసిన నిందితులను కఠినంగా శిక్షించడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు ఇటీవల కుల దురహంకార హత్యకు గురైన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు సూర్యాపేటలోని వారి ఇంటికి వచ్చిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారికి కెవిపిఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం పేరుతో హత్య గావించబడ్డ బంటి కుటుంబాన్ని నేటి వరకు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలు పరామర్శించకపోవడం సరైనది కాదన్నారు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేశామని చెబుతున్న పోలీసులు బంటి హత్యగావింపబడ్డ నాలుగు రోజుల తర్వాత వారి స్వగ్రామం తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో బైక్ పై వచ్చి రెండు కోట్లు ఇస్తాము కేసు విత్ డ్రా చేసుకోండి లేకపోతే నిన్ను నీ కోడల్ని చంపేస్తామని బంటి తండ్రిని బెదిరింపులు చేసిన దానిపై నేటికీ ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం సరికాదని అన్నారు బంటి హత్య కేసును పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మూడు నెలల్లో సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు అరెస్టు చేసి రిమాండ్ చేసిన నిందితులే కాకుండా మరికొంతమంది హస్తం కూడా బంటి హత్యలో ఉందని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారని వెంటనే వారిని గుర్తించి అరెస్టు చేయాలని అన్నారు అట్రాసిటీ చట్ట ప్రకారం కేసు నమోదైన తర్వాత 25% నష్టపరిహారం బాధితులకు ఇవ్వాల్సి ఉండగా ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వస్తున్నారని తెలుసుకొని ఉదయం చెక్కు అందజేశారని ఇది సరైన విధానం కాదని అన్నారు దళిత యువకుడి హత్య కేసు విషయంలో జిల్లా అధికారులు చిత్తశుద్ధితో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు కులం పేరుతో హత్యకు గురైన బంటి కుటుంబానికి అట్రాసిటీ చట్టప్రకారం వర్తించే నష్టపరిహారం కాకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు బంటి భార్య భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆరు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించాలని అన్నారు బంటి ఇంటి వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని తెలిపారు బంటి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అన్ని దళిత సామాజిక సంఘాలను కలుపుకొని ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హస్సేన్ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు మర్రి నాగేశ్వరరావు మాల మహానాడు జిల్లా నాయకులు వీర్జాల వేణు కట్టా సైదులు కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి దేవరకొండ యాదగిరి నాయకులు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు