schedule Monday, August 24, 2026

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సమావేశం

calendar_today February 7, 2025
person meenewstelugu
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సమావేశం

 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సమావేశం

   

బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మగ్గరి హన్మండ్లు 

 

 మీ న్యూస్ ప్రతినిధి::నిజామాబాద్ జిల్లా,నవిపేట్ మండలం:- బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆద్యక్షులు మగ్గరి హన్మండ్లు గారి ఆద్యక్షతన ఈ రోజు పాలకవర్గవ సమావేశం నిర్వహించి పలు తిర్మానాలు చేయడం,జరిగింది.

చేపట్టిన తిర్మాణాలు.

సంఘం నందు నూతనంగా సభ్యులుగా చేరాలనే వారికి సభ్యత్వము కల్పిస్తూ పట్టా పాసు పుస్తకము కలిగి ఉన్న వారికి రుసుము 1000 రూపాయల చొప్పున సభ్యత్వం కల్పింఛడానికి ఎకగ్రివంగా తిర్మానించనైనాధి.

సంఘం యొక్క ఆర్థిక లావాదేవిలు,జమ ఖర్చులు,లాభా నష్టాల ఖాతా చదివి వినిపించి ఏకగ్రివంగా తిర్మానించనైనది.

నాడాపూర్ లో ఎరువుల గిడ్డంగిని నిర్మించుటకు ఎకగ్రివంగా తిర్మాణించనైనది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలుపరచుతున్న రైతు పంట రుణమాఫీ పథకము నందు ఆర్హులై ఉండి కుడా సాంకేతిక కారణాల వలన అనర్హత పొంది నష్టపోతున్నటువంటి రైతులకు న్యాయం చేయుటకు గాను రైతుల పక్షాన ఇంటలెక్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ వారు ఇట్టి రైతుల రుణమాఫీకి అనర్హతకు కారణమైనందున వారిపై న్యాయపరమైనటువంటి పోరాటం చేయుటకు రైతుల పక్షాన తీర్మానం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో సంఘ ఆద్యక్షులు మగ్గరి హన్మండ్లు,ఉపాద్యక్షులు ఖజా ఆశమోద్దిన్,పాలక వర్గ సభ్యులు విజయ్,ఆంజాగౌడ్,పుల్ల గంగాదర్,బాలు చందర్,లక్ష్మి,రమణా రావు, నవిన్ రావు,సంపూర్ణ, గంగాదర్, సీఈవో రమేష్ ఉన్నారు.