schedule Monday, August 24, 2026

నూతనకల్ మండల సమగ్ర అభివృద్ధికై పోరాడుదాం

calendar_today February 7, 2025
person meenewstelugu
నూతనకల్ మండల సమగ్ర అభివృద్ధికై పోరాడుదాం

నూతనకల్ మండల సమగ్ర అభివృద్ధికై పోరాడుదాం

 ఐ ఎఫ్ టీ యూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 7:ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన నూతనకల్ మండల అభివృద్ధికి తోడ్పడతాయని మండల ప్రజలు ఎంత ఆశించినా గానీ ఫలితాలు మాత్రం నిరాశే మిగిల్చాయని ఐఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య అన్నారు.ఈ సందర్భంగా గంట నాగయ్య పాల్గొని మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీలు అభివృద్ధి గురించి గొప్పలు చెప్పినవారు ఆచరణలో ఒక్క అడుగు ముందుకు వేయడం లేదన్నారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ప్రభుత్వాలను దుయ్యబట్టారు ఇతర మండలాలతో పోల్చుకుంటే నూతనకల్ మండలం అభివృద్ధిలో చాలా వెనుకబడిందని వారు అన్నారు గత ప్రభుత్వంలో మండలం అభివృద్ధి జరగలేదని మండల ప్రజలు అధిక

 మొత్తంలో కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా కానీ మండల ప్రజల సమస్యలు అదేవిధంగా ఉన్నాయన్నారు . మండలం లో జన్నారెడ్డి ప్రతాపరెడ్డి వారసుల భూములకు సుమారు 1680 ఎకరాలు భూములను పేద ప్రజలకు పట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ కాలువలను మెరుగుపరిచి మండల చివరి ఆయకట్ట వరకు నీరందించాలన్నారు. మండల కేంద్రంలో ఇంటర్ కళాశాల గురుకుల మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మండల కేంద్రంలో డ్రైనేజీ కాలువలు స్ట్రీట్ లైట్లు వేయాలని గ్రంథాలయం కు సొంత బిల్డింగ్ నిర్మించాలని అదేవిధంగా నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపైన బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని అన్నారు. మండల రైతాంగ చిరకాల కోరిక మినీ మార్కెట్ యార్డును ఏర్పాటు చేయాలని మండల కేంద్రంలో భూమిలేని పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అడ్డగోలుగా జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా బొగ్గు బట్టిల వ్యాపారాన్ని వ్యాపారాన్ని అరికట్టాలన యువత మొత్తం మద్యానికి బానిసై మత్తుపదార్థాలకు బానిసై చెడిపోతున్నారని వాటిని కూడా నివారించాలని వారు డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు సుంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండల నాయకులు దగ్గుల మల్లయ్య గడ్డం శీను బోలగాని ఉప్పలయ్య ఉప్పల మణికుమార్ పులుసు క్రాంతి కుమార్ చీమల నరేష్ మున్న మధు ముప్పాని మధు పంతం రామచంద్రు పులుసు మహేష్ కూసు పరమేష్ ప్రశాంత్ ఎల్లేష్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు