schedule Monday, August 24, 2026

ప్రైవేట్ ఉపాధ్యాయులకు 12నెలల వేతనం ఇవ్వాలి

calendar_today February 10, 2025
person meenewstelugu
ప్రైవేట్ ఉపాధ్యాయులకు 12నెలల వేతనం ఇవ్వాలి

ప్రైవేట్ ఉపాధ్యాయులకు 12నెలల వేతనం ఇవ్వాలి

 

మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 9

రాష్ట్రంలోని ప్రతి ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు 12నెలల వేతనాన్ని యాజమాన్యాలు ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థపాక రాష్ట్ర అధ్యక్షుడు బస్కూరి కేపీ కుమార్ డిమాండ్ చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీపియుఎస్ 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ ను జిల్లా కమిటీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతతో పాటు హెల్త్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రైవేట్ టీచర్లపై వివిధ పాఠశాలల్లో జరుగుతున్నదాడులను రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని ఆయన కోరారు. ఏ ప్రైవేట్ పాఠశాలైన అకారణంగా ఆయా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తొలగించరాదనీ ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు పిల్లలమర్రి కళింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, బచ్చలకూరి జానయ్య, మహేష్, యాదవ్,శెట్టి రాజశేఖర్,ఆర్. రమేష్, ఎం.సోమరాజు,తదితరులు పాల్గొన్నారు.