బెల్కటూర్ బ్రిడ్జ్ కు BMR బ్రిడ్జ్ గా నామకరణం చేయాలని
calendar_today
February 11, 2025
person
meenewstelugu
బెల్కటూర్ బ్రిడ్జ్ కు BMR బ్రిడ్జ్ గా నామకరణం చేయాలని
యూత్ కాంగ్రెస్ నాయకుడు నియోజకవర్గ అధ్యక్షుడు తుపాకుల అనిల్ డిమాండ్
బెల్కటూర్ బ్రిడ్జి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు
పనులను పరియావేక్షించిన యూత్ కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గ అధ్యక్షుడు తుపాకుల అనిల్ కుమార్,
మండల ప్రెసిడెంట్ సుధాకర్, సునీల్ సుధీర్
మీ న్యూస్ ప్రతినిధి:: గత ప్రభుత్వంలో గౌతాపూర్ నుండి కరణ్ కోట్ వరకు రోడ్డు పూర్తి చేస్తామని చెప్పి మోసం చేసింది. అలాగే బెల్కటూర్ వాగు వలన కరణ్ కోట్, ఓగిపూర్ గ్రామాలకు వెళ్లి ప్రజలు వర్షాకాలంలో నాన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వారి సహకారంతో బెల్కటూరు బ్రిడ్జ్ పనులు ప్రారంభం అయినవి.నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ పదుల సంవత్సరాలుగా ఇదే రోడ్డుపై నుండి తిరుగుతూ ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు అయినారు ఉన్నత మంత్రి పదవులు చేపట్టారు ఎంతమంది ప్రజాప్రతినిధులకు అడిగిన బ్రిడ్జి పనులు మొదలుపట్టలేకపోయారు
కానీ మా బాధలు అర్థం చేసుకొని గెలిచిన సంవత్సరంలోపే బెల్కటూర్ బ్రిడ్జి పనులు మొదలుపెట్టి శరవేగంగా ఇంకా ఒకటి రెండు నెలలు పూర్తి చేయాలని దృడ సంకల్పంతో మన నాయకుడు బుయ్యాని మనోహర్ అన్న ఉన్నారు... ఇకపై కర్ణాటక నుండి వచ్చే వరినికి ఓగిపూర్,కరణ్ కోట్, చంద్రవంచ,చిట్టి ఘనపూర్, బెల్కటూర్, వీరారెడ్డిపల్లి, వంటి మరికొన్ని గ్రామాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వర్షాకాలంలో తలెత్తవు రవాణా సౌకర్యం సాఫీగా జరుగుతుందని గ్రామాల ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.