మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 13 మోతే మండలంలోని వివిధ గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాదవేంధర్ రెడ్డి తెలిపారు. రాఘవపురం గ్రామానికి చెందిన లింగయ్య, రంగాపురం తండ కు చెందిన గుగులోతు సురేష్, బుజ్జి ,పద్మ, పాచ్య నాయక్ తండ కు చెందిన హేమ కుమార్ లకు సంబంధించిన ఇసుక ట్రాక్టర్లను అనుమతి లేకుండా ఇసుక రవాణా చేయడంతో వాటిని పట్టుకోవడం జరిగిందని , ఐదు ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు, గ్రామాల్లో ఎవరైనా ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇసుకను రవాణా చేయకుండా అడ్డుకునేందుకు రంగాపురం తండా, నరసింహపురం, ఊర్లుగొండ ,తుమ్మ గూడెం,రాయి కుంట తండా గ్రామాల వద్ద వాగుకు వెళ్లే దారిలో ట్రాక్టర్ వెళ్లకుండా జెసిబి ద్వారా గుంతలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.