schedule Monday, August 24, 2026

సంతోషి మాత దేవాలయంలో మార్చి 3న నూతన జీవద్వజం ప్రతిష్ట

calendar_today February 13, 2025
person meenewstelugu
సంతోషి మాత దేవాలయంలో మార్చి 3న నూతన జీవద్వజం ప్రతిష్ట

శ్రీ సంతోషి మాత దేవాలయంలో మార్చి 3న నూతన జీవద్వజం ప్రతిష్ట

   

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 13:: శ్రీ సంతోషిమాత దేవాలయంలో మార్చి 1నుండి మూడు  రోజులపాటు నూతన జీవ ధ్వజ స్తంభం ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీ సంతోషిమాత దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్ లు తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయ ఆధ్యాత్మిక గ్రంథాలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులతో కలిసి జీవద్వజస్తంభ ప్రతిష్టా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1995లో దేవాలయ ప్రతిష్ట సందర్భంగా ఏర్పాటుచేసిన ధ్వజస్తంభం కొన్ని కారణాల వల్ల భిన్నం అయినందున నూతనంగా భక్తుల సహాయ సహకారాలతోటి జీవ ధ్వజస్తంభం ప్రతిష్టిస్తున్నట్లు తెలిపారు. మార్చి 3 న జరిగే ఈ ప్రతిష్టా కార్యక్రమానికి శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం పీఠాధిపతి శ్రీ అభినవోద్దండ విద్యా భారతి స్వామి వారి కరమలములచే ప్రతిష్టా కార్యక్రమం ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయం కమిటీ పాలవరపు రామమూర్తి, కొత్త మల్లికార్జున్, పబ్బా ప్రకాశరావు, బెలిదే అశోక్, తాళ్లపల్లి రామయ్య బ్రాహ్మ0డ్ల పల్లి మనోహర్ గుప్తా, గోపారపు రాజు, బ్రాహ్మ0డ్లపల్లి దేవి దత్తు, బోనగిరి విజయకుమార్, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, యామ వెంకటేశ్వర్లు, దేవరశెట్టి సోమయ్య, ముదిరెడ్డి లింగారెడ్డి, చింతా వెంకన్న, మహంకాళి సోమయ్య, జగదీశ్వరి, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.