మహావీరచక్ర సంతోష్ బాబు ప్రాణత్యాగం యువతకు స్ఫూర్తి కావాలి
calendar_today
February 13, 2025
person
meenewstelugu
మహావీరచక్ర సంతోష్ బాబు ప్రాణత్యాగం యువతకు స్ఫూర్తి కావాలి
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 13 :: మహావీర చక్ర సంతోష్ బాబు ప్రాణ త్యాగం యువతకు స్ఫూర్తి కావాలని ఆయన సతీమణి బిక్కు మల్ల సంతోషి తెలిపారు. గురువారం మహావీరచక్ర కల్నల్ సంతోష్ బాబు 42వ జయంతి సందర్భంగా వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బ్లడ్ క్యాంపును ప్రారంభించారు. పేదలకు అన్నప్రసాదం నిర్వహించి మాట్లాడారు. కల్నల్ సంతోష్ బాబు స్ఫూర్తిని, ఆయన ఆశయాలను నెరవేర్చటానికి ముందుంటామని వాసవి క్లబ్స్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆయన ఆశయాలను మీరందరూ ఎప్పుడు ఇలాగే గుర్తుంచుకొని ముందుకు తీసుకు వెళుతూ, మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సూర్యాపేట జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు తోట శ్యాంప్రసాద్ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొంది ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా రక్తదాన శిబిరంలో యువత ఎక్కువగా పాల్గొనడం అభినందనీయమన్నారు. వారి ఆశయ సాధనలో యువత ఆలోచన స్ఫూర్తిని పెంపొందించుకొని ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ రీజియన్ సెక్రెటరీ యామా సంతోష్ యూత్ క్లబ్ అధ్యక్షులు వెంపటి రవితేజ,వాసవి క్లబ్ అధ్యక్షులు మంచాల శ్రీనివాస్, సింగిరి కొండ రవీందర్, పబ్బతి వేణుమాధవ్,బిక్కుమల్ల కృష్ణ, పబ్బతి ప్రవీణ్ కుమార్, గుమ్మడ వెళ్లి శ్యాంసుందర్, మిర్యాల సుధాకర్, మైలవరపు సతీష్, చల్లా లక్ష్మయ్య, తల్లాడ శ్రీనివాస్, గుండా శ్రీధర్, పీవీ లక్ష్మీనారాయణ, శ్రీరంగం రాము, రతన్ తదితరులు పాల్గొన్నారు.