schedule Saturday, June 13, 2026

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి గెలుపే మన లక్ష్యం

calendar_today February 22, 2025
person meenewstelugu

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి గెలుపే మన లక్ష్యం

⏩::ప్రభుత్వం కులగణను మరలా చేపట్టడం బీసీ సంఘాల విజయమే 

⏩::ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ 

 

సూర్యాపేట జిల్లా మీ న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 21::సూర్యాపేట: ఈనెల 27 తారీఖున జరిగే వరంగల్, ఖమ్మం, నల్లగొండ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో శుక్రవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా కానీ అగ్రకులాలే ఆధిపత్యం చెలాయిస్తూ ఎన్నికల్లో బీసీలను ఓట్లు వేసే యంత్ర పరికరాలుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణను చేపడతామని ఇచ్చిన హామీ మేరకు చేపట్టి తూతూ మంత్రంగా చేపట్టి బీసీలను 42 శాతం చూపించడంతో బీసీ జెఏసి, బీసీ సంఘాల, పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం మరలా కులగణన చేయించడం ఎంబిసీ, బీసీ సంఘాల విజయమేనని అన్నారు.బీసీల్లో విప్లవం రాబోతుందని ఎన్నికల్లో అన్ని పార్టీలు పావులుగా వాడుకొని మోసం చేస్తున్నాయని తెలిపారు. బీసీలకు సంవత్సరానికి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ఈడబ్ల్యూసి పేరుతో అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ విద్యార్థులకు మొండి చేయి చూపుతున్నారని దుయ్యబట్టారు. 

 బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య కు పది లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సంఘాలు, బీసీ మేధావులు, బీసీ పట్టభద్రులు ఐక్యమై బహుజన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఐక్యమై రాజ్యాధికారం దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చాంద్ పాషా, కుంభం నాగరాజు, వల్లాల సైదులు, ఆవుల అంజయ్య, కుంభ వెంకన్న, వట్యాల శేఖర్, బడుగుల నాగార్జున, జానకి రాములు, సుమన్, పంతులు, గుంటూరు విజయ్, పెద్దబోయిన లింగయ్య, రాగం లింగయ్య, బోడపట్ల మధు, తదితరులు పాల్గొన్నారు