schedule Monday, August 24, 2026

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

calendar_today February 22, 2025
person meenewstelugu
ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

   

మీ న్యూస్ ప్రతినిధి::మోతె మండలంలోని రావికుంట తండా ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు బోధన చేసిన విధానం పలువురిని ఆకట్టుకుంది. ఈ స్వపరిపాలన దినోత్సవం లో భూక్య కార్తిక్ జిల్లా కలెక్టర్ గా, బుక్య చేతన్ జిల్లా విద్యాశాఖ అధికారిగా, సాహితి మండల విద్యాధికారిగా ,కవిత ప్రధానోపాధ్యాయురాలు గా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్.విజయ, ఉపాధ్యాయులు సిహెచ్ .సింహాద్రి , కె.సైదులు, ఎస్ఎంసి చైర్మన్ శోభ, విద్యార్థుల తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.