schedule Tuesday, August 25, 2026

లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షుల రొంపల్లి సంతోష్ధ్ ఆధ్వర్యంలో    గోల్డెన్ జూబ్లీ వేడుకలు

calendar_today February 23, 2025
person meenewstelugu
లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షుల రొంపల్లి సంతోష్ధ్ ఆధ్వర్యంలో    గోల్డెన్ జూబ్లీ వేడుకలు
[caption id="attachment_5568" align="aligncenter" width="640"] లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షుల రొంపల్లి సంతోష్ధ్ ఆధ్వర్యంలో    గోల్డెన్ జూబ్లీ వేడుకలు[/caption]

⏩::లయన్స్ క్లబ్ సేవలు మరువలేనివి.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

⏩::లయన్స్ క్లబ్ భవనాన్ని ఏర్పాటు చేయండి వైద్య పరికరాలు ఉచితంగా అందిస్తాం..

⏩::లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డి. కోటేశ్వరరావు

⏩::సమాజంలో సేవ చేసే భాగ్యం కల్పించింది.. అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్

 మీ న్యూస్ ప్రతినిధి:: లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు జోన్ 2, 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఆదివారం పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ హాల్ లో క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. క్లబ్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకలకు తాండూరూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డి. కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ గోల్డెన్ జూబ్లీ లో వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిల్ పంపిణీ ,అదేవిధంగా బస్తీ దవాఖానకు ఫర్నిచర్ ను ముఖ్య అతిథిగా చేతుల మీదుగా క్లబ్ నిర్వాహకులు అందజేశారు. అలాగే 50 సంవత్సరాల పాటు క్లబ్ బాధ్యతలు నిర్వహించిన అధ్యక్ష ,కార్యదర్శులకు ఘనంగా సన్మానించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ...లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు వారు గత 50 సంవత్సరాల నుంచి పేద మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రస్తుత కాలంలో కూడా లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.

 క్లబ్ డిస్టిక్ గవర్నర్ డి కోటేశ్వరరావు మాట్లాడుతూ..తాండూరు లో కొనసాగుతున్న క్లబ్ 50 సంవత్సరాల పూర్తి చేసుకున్న చరిత్ర, చేసిన సేవలు అభినందించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం తాండూరు క్లబ్ కు సొంత భవనం ను ఏర్పాటుకు చేసుకోవాలని అన్నారు. సొంత భవనం ఏర్పాటు అయిన వెంబడి తమ తరఫున భవనంలో డయాలసిస్, కంటి వైద్య పరికరాలు అయినటువంటి  అందజేస్తామని అన్నారు. రాబోయే అధ్యక్ష కార్యదర్శులు కూడా తమ వంతుగా భవనాలు నిర్మాణానికి కృషి చేయాలని అదేవిధంగా ప్రజలకు ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు అందించే విధంగా తోడ్పడాలని పిలుపునిచ్చారు..

 

లయన్ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ..చిన్న వయసులోనే సమాజంలో సేవ చేయాలని తపన ఉన్న నన్ను గుర్తించి క్లబ్ సభ్యులు తోడ్పాటు అందించి ఈ స్థాయికి తీసుకురావడం జరిగిందని అన్నారు. క్లబ్ నందు కోశాధికారిగా, కార్యదర్శిగా ,అధ్యక్షులుగా విధులు నిర్వహించడం జరిగిందని అన్నారు. 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ నా అధ్యక్షతన జరుపుకోవడం జీవితంలో తీపి గుర్తు అని అన్నారు. సమాజంలో సేవచేసే భాగ్యం కల్పించిన క్లబ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశం అనంతరం:: క్లబ్ కు తోడ్పాటు అందించిన వారందరికీ సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు 50 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో క్లబ్ కు ఆర్థికంగా సహకారం తోడ్పాటు అందించిన ప్రస్తుత జీవితంలో ఉన్న తాటికొండ ప్రభాకర్ గుప్తకు క్లబ్ నిర్వాహకులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో అతిథులు ఫస్ట్ డిస్టిక్ గవర్నర్ మహేంద్ర కుమార్ రెడ్డి, సెకండ్ వాయిస్ డిస్టిక్ లో ఉన్న సురేష్, రీజన్ చైర్మన్ అశోక్ యాదవ్,చటర్ నెంబర్ ప్రభాకర్ గుప్తా, జోన్ చైర్మన్ హెడ్రామీ బసన్నప్ప, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ రమేష్చంద్రపండి, ప్రోగ్రాం కో..కమిటీ చైర్మన్ సల్ల దామోదర్, మరియు క్లబ్ కార్యదర్శి విరప్రసాద్, కోశాధికారి అసద్ అలీ సభ్యులు రాజగోపాల్ సారడ తదితరులు ఉన్నారు