schedule Tuesday, August 25, 2026

కలశ స్తాపనతో ప్రారంభమైన మహా శివరాత్రి ఉత్సవాలు

calendar_today February 24, 2025
person meenewstelugu
కలశ స్తాపనతో ప్రారంభమైన మహా శివరాత్రి ఉత్సవాలు

కలశ స్తాపనతో ప్రారంభమైన మహా శివరాత్రి ఉత్సవాలు

   

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24::సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం కలశ స్థాపనతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక మండపంపై గణపతి పూజ పుణ్యాహవాచనం, కంకణ ధారణ, దీక్ష వస్త్రధారణ, రుద్ర హోమం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఈనెల 26 మహాశివరాత్రి సందర్భంగా 24 గంటలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగా తెల్లవారుజామున 6 గంటల నుండి 12 గంటల వరకు భక్తులే స్వయంగా స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి మీ స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చన్నారు. మారేడు దళాలతో పూజ, శివలింగాకృతిలో దీపోత్సవం ఎదుర్కోలు మహోత్సవం, శివ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు బెలిదేఅశోక్, యామా వెంకటేశ్వర్లు, యామ విజయలక్ష్మి, జగదీశ్వరి, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.