ఆశీర్వదించి గెలిపిస్తే విద్యావస్థను అభివృద్ధి చేసి చూపిస్తా..
calendar_today
February 24, 2025
person
meenewstelugu
ఆశీర్వదించి గెలిపిస్తే విద్యావస్థను అభివృద్ధి చేసి చూపిస్తా..
⏩::స్కూల్స్,కాలేజీలలో అన్ని వసతులు ఉండేలా చూస్తాను.
⏩::దొడ్ల వెంకట్,తెలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ అభ్యర్థి
మీ న్యూస్ ప్రతినిధి::తెలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి దొడ్ల వెంకట్ ప్రచారంలో భాగంగా పట్టణంలోని వివిధ కాలేజీలలో విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది.అనంతరం ఆయన మాట్లాడుతూ... నిరుద్యోగులు,విద్యావంతులు ఉపాద్యాయులు పెద్ద మనస్సుతో ఆశీర్వదించి గెలిపిస్తే సామాన్యులకు సైతం నాణ్యమైన విద్యను అందించే దిశగా కృషి చేస్తానని,అదే విధంగా పరిశ్రమల్లో స్థానికులకే ఉన్నత ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం అని ఆయన అన్నారు.బీజేపీ ,కాంగ్రెస్ అభ్యర్థులు డబ్బుతో పట్టభద్రుల ఓట్లు కొనవచ్చు అనే భ్రమతో ఉన్నారని,అలాంటి వారికి ఓటు వేయవద్దని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజాశక్తి పార్టీ కి ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని, పట్టభద్రుల ఆశీర్వాదంతో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పట్లోల్ల రామ్ రెడ్డి, రుమాండ్ల మురళి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.