schedule Monday, August 24, 2026

అడ్వకేట్ జటంగి వెంకటేశ్వర్లు యాదవ్ మృతి బాధాకరం

calendar_today February 25, 2025
person meenewstelugu
అడ్వకేట్ జటంగి వెంకటేశ్వర్లు యాదవ్ మృతి బాధాకరం

అడ్వకేట్ జటంగి వెంకటేశ్వర్లు యాదవ్ మృతి బాధాకరం

 

⏩::వెంకటేశ్వర్లు మృతి సూర్యాపేట ప్రాంతానికి తీరని లోటు

 

⏩::బిఆర్ఎస్ పార్టీ మోతే మండల అధ్యక్షులు శీలం సైదులు యాదవ్

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25::చివ్వెంల మండలం వట్టి ఖమ్మంపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జటంగి వెంకటేశ్వర్లు యాదవ్ మృతి బాధాకరమని *బిఆర్ఎస్ పార్టీ మోతే మండల అధ్యక్షులు శీలం సైదులు యాదవ్* అన్నారు. మంగళవారం వట్టి కాంపౌండ్ గ్రామంలో వెంకటేశ్వర్లు యాదవ్ గారి మృత దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... లాయర్ జటంగి వెంకటేశ్వర్లు మృతి సూర్యాపేట ప్రాంత ప్రజలకు తీరనిలోటు అని ఆయన అన్నారు. జటంగి వెంకటేశ్వర్లు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థించారు. జటంగి ‌ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి ఎలిమినేట్ రమేష్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు అజిత్, మిక్కిలినేని సతీష్, రాఘవపురం మాజీ సర్పంచ్ గుండాల గంగులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.