schedule Monday, November 02, 2026

జాతీయ సైన్స్ దినోత్సవం

calendar_today March 1, 2025
person meenewstelugu
జాతీయ సైన్స్ దినోత్సవం

జాతీయ సైన్స్ దినోత్సవం

మీ న్యూస్ ప్రతినిధి::జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపీపీస్ ,జెడ్ పి హెచ్ ఎస్ రావి పహాడ్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అధ్యక్షుడు ముప్పారపు నరేందర్ మాట్లాడుతూ గాలి నీరు భూమి కలిసిన కాకుండా ప్రతి విద్యార్థి ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను వివరించి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు చేతి సంచి తో బయలుదేరి ప్లాస్టిక్ కవర్లను తిరస్కరించడం ద్వారా స్టీల్ వస్తువులను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని రక్షించినట్లు అవుతుందన్నారు. పుట్టినరోజులు సందర్భంగా మొక్కల్ని నాటడం ఇతరులకు అవగాహన కల్పించడం తప్పనిసరి బాధ్యతగా భావించాలని వివరించారు ఈ కార్యక్రమంలో తల్లాడ రామచంద్రయ్య, కొక్కుల సంపత్, బండి పాపిరెడ్డి, అమృత రెడ్డి, N. పరమేష్, శ్రీధర్ రెడ్డి, నరసింహారెడ్డి, మోతిలాల్,, నాగరాజు, వెంకన్న, సీనయ్య, రాంబాబు, విజయలక్ష్మి పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు