schedule Tuesday, August 25, 2026

జర్నలిస్టు రఘు మృతి బాధాకరం

calendar_today March 3, 2025
person meenewstelugu
జర్నలిస్టు రఘు మృతి బాధాకరం

జర్నలిస్టు రఘు మృతి బాధాకరం

⏩::జర్నలిస్టు రఘు కుటుంబానికి అండగా ఉంటాం

⏩::జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉండాలి

⏩::జర్నలిస్టు రఘు చిత్రపటానికి నివాళులర్పించిన మందకృష్ణ మాదిగ 

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి కో లరవీందర్ గౌడ్ 9640 6595 60 మార్చి 2:: ఎలక్ట్రానిక్ మీడియా కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు జర్నలిస్టు పడిశాల రఘు మృతి తనకు ఎంతో బాధ కలిగించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రఘు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆదివారం కోదాడ పట్టణం అంబేద్కర్ కాలనీలోని రఘు నివాసానికి వెళ్లి మాదిగ జర్నలిస్టు ఫోరం, ఎంఆర్పిఎస్ నాయకులు తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మీడియా రంగంలో సుదీర్ఘకాలం అనుభవం ఉన్న రఘు సమాజంలో మార్పునకు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం నిస్వార్ధంగా పనిచేశారని ఆయన సేవలను కొనియాడారు. రఘు కుటుంబానికి మాదిగ జర్నలిస్టు ఫోరం ఎమ్మార్పీఎస్ పక్షాన అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.