schedule Saturday, August 22, 2026

రికార్డులు ట్యాంపరింగ్ చేసినందుకు ఇద్దరు గిర్దవార్ లు సస్పెండ్......

calendar_today March 6, 2025
person meenewstelugu
రికార్డులు ట్యాంపరింగ్ చేసినందుకు ఇద్దరు గిర్దవార్ లు సస్పెండ్......

రికార్డులు ట్యాంపరింగ్ చేసినందుకు ఇద్దరు గిర్దవార్ లు సస్పెండ్

 ⏩:జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

 

⏩::మీ న్యూస్ సూర్యపేట జిల్లా ప్రతినిధి కోలరవీందర్ గౌడ్ 9640659560

 

మీ న్యూస్ ప్రతినిధి మార్చి 5::మోతే తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను ట్యాంపరింగ్ చేసినందుకు గాను ఇద్దరు గిర్దవార్ లను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మోతే మండల గిర్దవార్ గా విధులు నిర్వహిస్తున్న జే నిర్మలదేవి, అదనపు గిర్థవార్ షేక్ మన్సుర్ అలీలు పాత పహాణి రికార్డులలో పేర్లు లేకపోయినా పేర్లు ఉన్నట్లు సృష్టించి ధరణి లో మిస్సింగ్ సర్వే నెంబర్లు కింద 11 దరఖాస్తులు చేపించి భూమి ఉన్నట్టు తప్పుడు ధ్రువీకరణ చేసి పంపించటం జరిగిందని అన్నారు. నిన్న రాత్రి ఇట్టి విషయమై కలేక్టర్ మోతే తహసీల్దార్ కార్యాలయానికి వేళ్ళి రికార్డులు పరిశీలించి ట్యాంపరింగ్ చేయటం జరిగిందని నిర్దారించడమైనది. పలు రికార్డులను ట్యాంపరింగ్ చేసి ఉన్నత అధికారులను తప్పుదోవ పట్టించిన మోతే మండల గిర్థవార్లు జే నిర్మలదేవి, అదనపు గిర్థవార్ షేక్ మన్సుర్ అలీ లను సస్పెండ్ చేస్తున్నట్లు అలాగే తదుపరి విచారణలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలిపారు.