schedule Saturday, June 13, 2026

అంగరంగ వైభవంగా శ్రావణమాస వేడుకలు.

calendar_today August 27, 2024
person meenewstelugu

అంగరంగ వైభవంగా శ్రావణమాస వేడుకలు.

 

వడ్డెర కులస్తులు అంగరంగ వైభవంగా వనబోజన కార్యక్రమం..

మీ న్యూస్ సూర్య పేట్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ 

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం...మహోత్సవ వేడుకలను వడ్డెర కులస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని వడ్డెర కులస్తులు శ్రావణమాసం సందర్భంగా వనభోజన కార్యక్రమ వేడుకలను నిర్వహించుకున్నారు. వేడుకలలో వడ్డెర కులానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తరతరాల నుండి క్రమం తప్పకుండా వనభోజన కార్యక్రమం పాటిస్తున్నామన్నారు.వనవాసం వలన సకాలంలో వర్షాలు కురవాలని సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని వారిప్రగాఢ నమ్మకం గ్రామం సమీపాన ఉన్న శ్రీ గట్టు మైసమ్మ తల్లి దేవస్థానం వద్ద వనవాస కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటామన్నారు. అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధుమిత్రులు అందరూ ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటూ సహపంక్తి భోజనాలను చేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కుల పెద్దమనిషి దేవ రంగుల వీరన్న తదితరులు పాల్గొన్నారు.