schedule Monday, August 24, 2026

అడ్వకేట్ జటంగి వెంకటేశ్వర్లు యాదవ్ మృతి బాధాకరం

calendar_today March 6, 2025
person meenewstelugu
అడ్వకేట్ జటంగి వెంకటేశ్వర్లు యాదవ్ మృతి బాధాకరం

అడ్వకేట్ జటంగి వెంకటేశ్వర్లు యాదవ్ మృతి బాధాకరం

 

⏩::వెంకటేశ్వర్లు మృతి సూర్యాపేట ప్రాంతానికి తీరని లోటు

 

⏩::కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్

 

⏩::మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కో ల.రవీందర్ Slow 9640659560

 

మీ న్యూస్ ప్రతినిధి మార్చి 6::చివ్వెంల మండలం వట్టి ఖమ్మంపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జటంగి వెంకటేశ్వర్లు యాదవ్ మృతి బాధాకరమని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్అన్నారు. గురువారం వట్టి కాంపౌండ్ గ్రామంలో వెంకటేశ్వర్లు యాదవ్ గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... లాయర్ జటంగి వెంకటేశ్వర్లు మృతి సూర్యాపేట ప్రాంత ప్రజలకు తీరనిలోటు అని ఆయన అన్నారు. జటంగి వెంకటేశ్వర్లు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థించారు. జటంగి ‌ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట మోతే మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ , బిఆర్ఎస్ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మర్యాద సైదులు, మాజీ ఎంపీపీ బడుగుల శ్రీనివాస్ యాదవ్, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మట్టి పెళ్లి రాము, రాఘవపురం మాజీ సర్పంచ్ గుండాల గంగులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.