schedule Monday, August 24, 2026

ఇందిరానగర్ 2వ వార్డులో త్రాగునీరు సమస్య 

calendar_today March 16, 2025
person meenewstelugu
ఇందిరానగర్ 2వ వార్డులో త్రాగునీరు సమస్య 
ఇందిరానగర్ 2వ వార్డులో త్రాగునీరు సమస్య   

⏩::మున్సిపల్ పరిధ లో త్రాగునీరు, విద్యుత్ దీపాల సమస్య

 ⏩::ఎండాకాలం తాండూరు ప్రాంతం ప్రజలు తీవ్ర అవస్థలు

 ⏩::వెంటనే తాగునీటి సమస్య తీర్చాలంటూ సిపిఎం పార్టీ డిమాండ్

 

మీ న్యూస్ ప్రతినిధి::సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో ఇందిరానగర్ 2వ వార్డులో త్రాగునీరు సమస్య పరిష్కరించాలని స్థానిక మహిళలతో కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని తాండూర్ మున్సిపల్ పరిధిలో త్రాగునీరు సమస్య విద్యుత్ దీపాల సమస్య మోరీల సమస్య తీవ్రంగా ఉంది అన్నారు తాగునీరు కోసం ఎండాకాలం స్థానికంగా ఉన్న మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు మున్సిపల్ కమిషనర్  అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తాగునీరు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీ మహాలక్ష్మి పథకం 2500రూపాయలు, ఇందిరమ్మ ఇండ్లు పింఛన్ రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు స్థానిక మహిళలు లక్ష్మి ఇంతియాజ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు