schedule Saturday, June 13, 2026

పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు

calendar_today March 20, 2025
person meenewstelugu

పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు

⏩::విద్యార్థులకు శుభాకంక్షలు.
⏩++అందరూ బాగా రాయాలి.
 ⏩::ప్రయాణ సమయంలో ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
⏩:: నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
⏩::మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోలరవీందర్ గౌడ్ 9640659560 మార్చి 19
జిల్లా పరిధిలో జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద మార్చి 21 నుండి ఏప్రియల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని జిల్లా ఎస్పీ శ్రీ. కె నరసింహ ఐపీఎస్ గారు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11912 విద్యార్థు లకు 67 పరీక్షా కేంద్రాలలో నిర్వహించే పదవ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు.  అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, ప్రచారాలు నిర్వహించరాదని పెర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలున తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు కంగారుగా వెళ్ళవద్దు, సమయానికి బయలుదేరాలి, రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.