⏩::నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తండు సంజీవ గౌడ్
మీ న్యూస్ మార్చి 26::కోదాడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి కి మహిళా కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తండు సంజీవ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళా అభ్యర్థుల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఏకైక నాయకురాలు పద్మావతి రెడ్డి అని పేర్కొన్నారు. వారు మంత్రి పదవికి అన్ని విధాలుగా అర్హులని, నిత్యం ప్రజలతో మమేకమవుతూ సమస్యలపై దృష్టి సారిస్తున్నారని తెలిపారు. కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఎప్పటికప్పుడు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రతినిత్యం రాష్ట్ర, జాతీయ పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతూ ముందుకు సాగుతున్నారు. పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. తన భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో అభివృద్ధిలో భాగస్వామ్యమవుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా మరింత పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త ఆమెను మంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.