schedule Tuesday, August 25, 2026

పాస్టర్ పగడాల ప్రవీణ్ హత్య కు నిరసనగా భారీ నిరసన ర్యాలీ

calendar_today March 28, 2025
person meenewstelugu
పాస్టర్ పగడాల ప్రవీణ్ హత్య కు నిరసనగా భారీ నిరసన ర్యాలీ

పాస్టర్ పగడాల ప్రవీణ్ హత్య కు నిరసనగా భారీ నిరసన ర్యాలీ

మీ న్యూస్ మార్చి 27::  సూర్యాపేట ఖమ్మం రోడ్డు లోని అంబేద్కర్ బొమ్మ సెంటర్ లో సూర్యాపేట నియోజకవర్గ , పట్టణ పాస్టర్స్ పెలోషిఫ్, రీచ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ హత్య పై భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో తెలంగాణా మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర

అధ్యక్షులు ఇరుగు సంసోను, ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ నాయకులను హత్య చేసిన దుండగులు ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని,న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు రెవ. జలగం జేమ్స్,వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రదర్ బొజ్జ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ హత్య ను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది హెయమైన పిరికి పంద చర్య అనీ అన్నారు .ఈ కార్యక్రమం లో సూర్యాపేట పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రదర్ బొల్లు జాన్ పాల్,రెవ పంది మార్క్,పట్టణ కోశాధికారి పాస్టర్ స్పర్జన్ రాజు,పాల్వాయి అజయ్ పాస్టర్ సామెల్ 100 మంది పైగా పాస్టర్స్ పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.