సూర్యాపేట బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా కొంపల్లి లింగయ్య
calendar_today
March 30, 2025
person
meenewstelugu
సూర్యాపేట బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా కొంపల్లి లింగయ్య
మీ న్యూస్ మార్చి 29::సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది, సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపల్లి లింగయ్య యాదవ్ గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్ గా గుంటూరు మధు, జనరల్ సెక్రటరీగా సుంకరబోయిన రాజు, జాయింట్ సెక్రటరీగా దావుల చిన వీర ప్రసాద్, ట్రెజరర్ గా ఎండి అబ్దుల్ లతీఫ్ , గేమ్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ధరావత్ వీరేష్ కుమార్ గెలుపొందారు. కార్యవర్గ సభ్యులు గా కాసం సరిత, కుంచం చంద్రకాంత్, జటంగి శ్రీనాథ్, మంచి నీళ్ల లక్ష్మణ్, అనంతల సందీప్ లు గెలుపొందారు. అధ్యక్షుడిగా గెలుపొందిన కొంపెల్లి లింగయ్య తదితరులకు మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి, పుట్టా కిషోర్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, న్యాయవాదులు అడిషనల్ పీపీ నాతి సవిందర్, గొండ్రాల అశోక్, నల్లగుంట్ల అయోధ్య, మీలా రమేష్ ,మోదుగు వెంకట్ రెడ్డి, మీసాల శ్రీనివాస్, జే .తిరుమల్, కృష్ణ గౌడ్, చంద్ర మౌళి,ఉత్కూరి సైదులు, తదితరులు అభినందనలు తెలిపారు.