schedule Tuesday, August 25, 2026

ఘనంగా జయ ఐఐటి ఒలింపియాడ్ కిండర్ గార్టెన్ కన్వోకేషన్ 2025

calendar_today April 2, 2025
person meenewstelugu
ఘనంగా జయ ఐఐటి ఒలింపియాడ్ కిండర్ గార్టెన్ కన్వోకేషన్ 2025

ఘనంగా జయ ఐఐటి ఒలింపియాడ్ కిండర్ గార్టెన్ కన్వోకేషన్ 2025

   

 మీ న్యూస్ ప్రతినిధి::తమ స్కూల్ నందు చిన్నారులకు చదువుతో పాటు బారతీయ సంస్కృతి సంప్రదాయాలు నేర్పిస్తూ జయ ఐఐటి ఒలింపియాడ్ స్కూల్ చిన్నారులకు చక్కని సంస్కారం అందిస్తుందని జయ స్కూల్ కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ అన్నారు. బుధవారం సాయంత్రం జయ ఒలింపియాడ్ కిండర్ గార్టెన్ కన్వకేషన్ 2025 కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయ స్కూల్ డైరెక్టర్ లు జెల్లా పద్మ, బింగి జ్యోతి లు మాట్లాడుతూ తమ స్కూల్ నందు విద్యార్దులకు విద్యతో పాటు వినయం, క్రమశిక్షణ, మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. జయ స్కూల్ 2012 నుండి రాష్ట్ర స్ధాయి, జాతీయ స్ధాయి పోటి పరీక్షలలో ఎల్లప్పుడూ ప్రధమ స్థానంలో నిలుస్తూ అనేక అవార్డులు సాధించిందని అన్నారు. జయ స్కూల్ నుండి ఎటువంటి ప్రచార ఆర్బాటం గాని , డోర్ టు డోర్ ప్రచారం గాని చేయకుండా అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. గత 13 సంవత్సరాల నుండి జయ స్కూల్ సూర్యాపేట జిల్లా లో ఒక బ్రాండ్ నేమ్ గా విద్యారంగంలో జయకేతనం ఎగురవేస్తుందని, అందుకు సహకరిస్తున్న అధ్యాపక బృందానికి, ఎల్లవేళలా మద్దతు ఇస్తున్న విద్యార్దుల తల్లిదండ్రులకు ధన్యవాదములు తెలిపారు. చిన్నారులకు తల్లిదండ్రులు ఇంటివద్ద సెల్ ఫోన్ ఇవ్వకుండా కధల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు చదివించాలని అన్నారు. విద్యార్దులకు ప్రతి చోట జమ ఖర్చులను పిల్లలకు నేర్పించాలని తద్వారా వారికి అకౌంట్స్ తెలుస్తాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జయ స్కూల్ కిడ్స్ కు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ లను డైరెక్టర్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్దుల ఆటపాటలు అందరిని అలరించాయి.