schedule Saturday, June 13, 2026

నాసిరకంగా సిసి రోడ్ల నిర్మాణం

calendar_today April 4, 2025
person meenewstelugu

నాసిరకంగా సిసి రోడ్ల నిర్మాణం

పట్టించుకోని ప్రభుత్వ అధికారులు

మీ న్యూస్ ఏప్రిల్ 3::సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని సూర్యాపేట ఖమ్మం రహదారి పక్కనుండి మోతె మండల రైతువేదిక క్లస్టర్ మరియు హరితవనం వరకు సి సి రోడ్లు స్థానిక కాంట్రాక్టర్లు నిర్మాణాన్ని చేపట్టారు ఈ సి సి రోడ్లను పూర్తిగా నాసిరకంగా వేయడం జరిగింది ఇసుకతో వేయాల్సిన సిసి రోడ్డు తక్కువ ఖర్చు వస్తుందని కక్కుర్తి పడిన కాంట్రాక్టర్లు డస్ట్ పొడితోటి వేసి చేతులు దులుపుకున్నారు అదేవిధంగా 12 ఫీట్లువెడల్పు వేయాల్సిన సిసి రోడ్డు 10 ఫీట్లు వెడల్పు కూడా వేయలేని దుస్థితి నెలకొంది దీనివలన రోడ్డు వేసిన రోజే ఎక్కడికి అక్కడ పగలడం సైడు అంచులు పెచ్చులు పెచ్చులుగా కూలడం జరిగింది ఈ రోడ్డు మార్గంలో అనేకమంది రైతులు వారి సమస్యల పరిష్కారం కోసం రైతు వేదికకు రాకపోకలు కొనసాగిస్తుంటారు అదేవిధంగా హరితహారం లోకి ట్రాక్టర్లతో మొక్కలను ప్రజలకు అందించే కార్యక్రమాలు చేపడతారు ఇలాంటి నాసిరకమైన రోడ్డు వేయడంతో ప్రజలందరికీ ఇబ్బంది అవుతుందని ఈ సీసీ రోడ్డు ఎన్నో రోజులు ఉండదని ప్రజలు ఆగ్రహానికి గురి అవుతున్నారు దీనికి స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా ఈ సి సి రోడ్డు నిర్మాణాన్ని అధికారులు పరిశీలించి నాసిరకంగా సిసి రోడ్డు నిర్మాణం చేసిన నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తిరిగి నాణ్యమైన సిసి రోడ్లను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు