schedule Sunday, August 23, 2026

దళిత జాతి ముద్దు బిడ్డ డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

calendar_today April 5, 2025
person meenewstelugu
దళిత జాతి ముద్దు బిడ్డ డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

దళిత జాతి ముద్దు బిడ్డ డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

సమ సమాజ నిర్మాణానికి అవిశ్రాంతంగా పోరాటం చేసిన నాయకుడు

 

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్

మీ న్యూస్ ప్రతినిధి::జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలోని చింతలగట్టు చౌరస్తా వద్ద మహనీయుడు డా.బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ .అనంతరం వారు మాట్లాడుతూ,భారత దేశ పార్లమెంట్ చరిత్రలోనే అత్యధిక కాలం పార్లమెంటేరియన్ గా పని చేసిన ప్రజా హృదయభ్రాత బాబు జగ్జీవన్ రామ్ అని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కోహిర్ మండల పార్టీ అధ్యక్షులు రామలింగారెడ్డి , మాజీ ఎంపీటీసీ మల్లన్న పాటిల్ , హుగ్గేలి రాములు ఎయంసి డైరెక్టర్ అశోక్ ఎస్సి సెల్ అధ్యక్షులు అనిల్ ,INTUC (F) రాజ్ కుమార్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ , అశోక్ , ముర్జల్ ,జగదీష్ స్వామి గారు, మునీర్ , ఆశ్రఫ్ గారు, ఇక్బాల్ , తతిధర నాయకులు పాల్గొన్నారు.