schedule Tuesday, August 25, 2026

ఈనెల 11న తాండూర్ లో మెగా జాబ్ మేళా

calendar_today April 9, 2025
person meenewstelugu
ఈనెల 11న తాండూర్ లో మెగా జాబ్ మేళా

ఈనెల 11న తాండూర్ లో మెగా జాబ్ మేళా

⏩::గ్లోబల్ యువతరం ఫౌండేషన్ మరియు బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ

⏩::మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జాబ్ మేళా

⏩::నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలి

⏩::జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ మరియు జివైఎఫ్ సభ్యులు విజయేందర్ అరుణ్ రాజు

మీ న్యూస్ ప్రతినిధి::మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని గ్లోబల్ యువతరం ఫౌండేషన్ మరియు బీసీ సంఘం తాండూర్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఈ నెల 11 ఏప్రిల్ 2025న తాండూర్ సింధు గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ప్రతినిధులు విజయేందర్ అరుణ్ రాజులు ఒక ప్రకటనలో తెలిపారు తాండూర్ మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోగలరని,నిరుద్యోగులు మరియు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు కూడా అర్హులు

ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోగలరు ఇట్టి జాబ్ మేళా కోసం 10వ తరగతి ఇంటర్మీడియట్,డిగ్రీ అర్హత కలిగి ఉండి 18-35 సంవత్సరాల మధ్య ఉన్న వారు అర్హులు .MNC కంపెనీల నుంచి జరిగే ఇట్టి మెగా జాబ్ మేళా వివిధ ఉద్యోగాల కోసం నిర్వహించబడును.విద్య అర్హతలు టెన్త్,ఇంటర్మీడియట్, డిగ్రీ,MLT ,DMLT, MPHWF, diploma, Polytechnic , PG ,MBA MCA, BTech చదివిన వారు అర్హులు అని బీసీ నేత రాజ్ కుమార్ తెలిపారు పూర్తి వివరాల కొరకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించవలసిందిగా కోరుతున్నాం9652100231,8465970580.