--పార్టీకి కృషిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు సముచిత స్థానం
--తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీకార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూర్ మీ న్యూస్ ప్రతినిధి : తాండూర్ ని కనివిని ఎరుగని రీతిలో అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుం దని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీసమావేశాన్ని అధ్యక్షులు హబీబ్ లాల ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిహాజరై అయన మాట్లాడుతూ ముఖ్యంగా గత పాలకుల హాయంలో తాండూరు అభివృద్ధికి నోచుకోలేదని.విమర్శించారు.కేవలం శిలాఫలకాలకే పరిమిత మయ్యాయని అన్నారు. వార్డులలో కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలకు గుర్తింపు రావాల్సిం దేనని అన్నారు. అదేవిధంగా పార్టీకి కృషి చేసిన అసలైన కాంగ్రెస్ నాయకులకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ పోటో ఐడెంటి కార్డు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. మరొకవైపు తనను నమ్మి గెలిపించినందుకునమ్మకాన్ని వమ్ము చేయన
ని..తాండూర్ ని అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని చెప్పారు.తాండూరు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో అని చేసి చూపిస్తాననిమరొకసారి ఎమ్మెల్యే పునరుద్ఘాటిం చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా సమన్వయంతో గెలుపే ధ్యేయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనిఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులకు
రాజివ్ యువ వికాసం ద్వారా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో
గడిచిన కాలంలో శాంతియుతంగా పాలన కొనసాగుతుందని అన్నారు. ఈ సమావేశంలో
తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్, అలీమ్ ,బస్వ రాజ్, రావూఫ్, అమీర్ అబ్దుల్లా, లింగదల్లి రవికుమార్, మాజీ కౌన్సిలర్ నీరజ, బొట్టు నర్సిములు, వడ్డే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, రజాక్, రవి, వెంకన్న గౌడ్, సమద్, జలాల్, ఖయ్యుమ్, ఓ వై సి,ముస్తాక్, సయ్యద్ ఖాజీ, ఫైయాజ్, ఇనాయత్, జిలాని, ఫరిద్, మాదవి, గౌస్ లాల, ముజిబ్ లాల, నీరటి రామలింగం, సిద్ధిక్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.