schedule Monday, August 24, 2026

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలివెళ్ళాలి..

calendar_today April 21, 2025
person meenewstelugu
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలివెళ్ళాలి..

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలివెళ్ళాలి..

⏩::మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

 

మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా మునగాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలకు  పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో వీటిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేయాలని సూచించారు..