schedule Saturday, August 22, 2026

రోడ్డు ప్రమాదంలో కోదాడ ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

calendar_today April 21, 2025
person meenewstelugu
రోడ్డు ప్రమాదంలో కోదాడ ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో కోదాడ ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

మీ న్యూస్ ప్రతినిధి::రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మునగాల మండలం ముకుందాపురం వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం... మునగాల గ్రామానికి చెందిన నారగాని రాంబాబు ( 38) కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం సైతం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై తన సొంత గ్రామం మునగాల వెళుతున్న క్రమంలో ముకుందాపురం స్టేజి వద్ద ఏటువంటి సూచికలు లేకుండా రహదారిపై ఆగి ఉన్న కారును వెనుక నుండి బైకు పై వెళ్తూ డి కొట్టాడు . దీంతో రాంబాబుకు తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఆస్పత్రుల్లో చికిత్స జరుగుతుండగానే మృతి చెందినట్లుగా తెలిపారు.