schedule Monday, November 02, 2026

కొప్పుల వేనా రెడ్డి పుట్టినరోజు వేడుకలు

calendar_today April 22, 2025
person meenewstelugu
కొప్పుల వేనా రెడ్డి పుట్టినరోజు వేడుకలు

కొప్పుల వేనా రెడ్డి పుట్టినరోజు వేడుకలు

⏩::రాచకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం

 

మీ న్యూస్ ప్రతినిధి:: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి పుట్టినరోజు సందర్భంగా పబ్లిక్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మంగళవారం పేద ప్రజలకు సుమారు 400 మందికి అన్నదానం చేశారు. ఫ్రూట్ కటింగ్ అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి స్వయంగా పాల్గొని పేద ప్రజలకు అన్న ప్రసాద వితరణ చేశారు.ఈ సందర్భంగా రాచకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ భగవంతుడు దయతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజాద్ అలీ, సూర్యాపేట మున్సిపాలిటీ మాజీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ గుప్త, ఆర్యవైశ్య ప్రముఖులు వెంపటి శబరినాథ్, వంగవీటి రమేష్ , బిక్కు మల్ల కృష్ణ ,చల్లా లక్ష్మయ్య ,జూలకంటి నాగరాజు బజ్జూరి శ్రీనివాసు, వెంపటి రవితేజ యామ సంతోష్, శ్రీరంగం రాము తెర టపల్లి సతీష్, బెల్దే శ్రీనివాస్, రుద్రంగి రవి, గజ్జి నాగేందర్, గుండా లక్ష్మయ్య, డోగుపర్తి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..