schedule Tuesday, August 25, 2026

ఎన్ఎస్పి అధికారులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం

calendar_today May 4, 2025
person meenewstelugu

ఎన్ఎస్పి అధికారులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం

 లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలుకాకపోవటంపై అసహనం

 సమీక్షలు నిర్వహిస్తున్నప్పుడు పనులు ఎందుకు చేయరు అంటూ ప్రశ్నించిన మంత్రి

 లిఫ్ట్ పనులపై తీవ్ర అసంతృప్తి నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560 మే 4

మీ న్యూస్ ప్రతినిధి::ఎన్ఎస్పి అధికారులపై నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన జలవనరుల శాఖ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఏడాది శంకుస్థాపన చేసిన రెడ్ల కుంట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శాంతినగర్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలు కాకపోవడంతో అధికారులపై మండిపడ్డారు.సమీక్షలు నిర్వహిస్తున్నప్పుడు పనులు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని జలవనుల శాఖ అధికారులు సి ఈ, ఎస్ఈ, లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఫ్ట్ పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే అధికారులను మందలించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ను పనులపై పర్యవేక్షించాలని ఆదేశించారు మరోసారి ఇలా నిర్లక్ష్యం చేస్తే సంబంధిత అధికారులపై వేటు తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ చౌహన్, సిఈ రమేష్ బాబు, ఎస్ ఈ ధర్మతేజ, జిల్లా ఎస్పీ నరసింహ, ఆర్డీవో సూర్యనారాయణ, తాసిల్దార్ వాజిద్ అలీ, జలవనురల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు