schedule Tuesday, August 25, 2026

ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు   

calendar_today May 6, 2025
person meenewstelugu
ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు   

ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు   

మీ న్యూస్ ప్రతినిధి: మే 5: సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలోని కాసరాబాద్ గ్రామం లో యువ రైతు ఏశబోయిన మల్లేష్ ఆధ్వర్యంలో కాసరబాధ చుట్టు పక్కన రైతులకు రైతు అవగాహన సదస్సులో ఆయిల్‌పామ్‌ పంట సాగుపై సూర్యాపేట నియోజకవర్గ ఉద్యాన శాఖ అధికారి స్వాతి, పతాంజలి కంపెనీ ఫుడ్ లిమిటెడ్ ఆయిల్ ఫామ్ జూనియర్ మేనేజర్ శశి కుమార్, క్షేత్ర సహాయకులు సుధాకర్ రెడ్డి లు పాల్గొని రైతులకు సోమవారం అవగాహన కల్పించారు.వారు మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ పంట ద్వారా రైతులకు ఎకరాకు 50 మొక్కలు రాయితీపై ప్రభుత్వం ఇస్తుందని, రైతులు అంతర్ పంటగా వేరు శెనిగ, జొన్న, కంది పంటలను వేసి అధిక లాభాలను పొందవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలోరైతులు తదితరులు పాల్గొన్నారు